హైదరాబాద్: భార్యతో విభేదాల కారణంగా మనస్తాపం చెందిన ఓ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. చిలకలగూడ, చింతబావికి చెందిన ఎం.జస్వంత్(26) ప్రైవేట్ ఉద్యోగి. నాలుగు నెలల క్రితం అలేఖ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. చిన్న విషయాలకే దంపతులు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో అలేఖ్యను కుటుంబసభ్యులు నవంబర్ 30న పుట్టింటికి తీసుకువెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన జస్వంత్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి బుధవారం అర్ధరాత్రి తన అన్నయ్య సీతారాంకు వాట్సాప్‌లో పెట్టాడు. గురువారం తెల్లవారుజామున వాట్సాప్ మెసేజ్ చూసి కంగారుపడ్డ సీతారం తమ్ముడి గదికి వెళ్లి తలుపుకొట్టాడు. ఎంతకూ తీయకపోవటంతో బలవంతంగా కిటికీ తెరిచి చూడగా జస్వంత్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సీతారాం ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm