హైదరాబాద్: రహత్‌నగర్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ శంకర్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను తీసుకవెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm