హైదరాబాద్: మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఏడుపాయల నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, అతివేగమే ప్రమాదానికి కారణమన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm