హైదరాబాద్: శుక్రవారం ఖమ్మం జిల్లా ఏన్కూరులో వైరా నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గోన్నారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలు తోక పార్టీలు. కమ్యూనిస్టు నాయకులు అమ్ముడుపోయారు అని ఎవరైనా అంటే వారి తాటతీస్తాం అని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల తమతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ తోనే పొత్తుకు అవకాశాలున్నాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm