హైదరాబాదు: శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రాజెక్టు అధికారులు, జిల్లా ఫారెస్ట్ అధికారులు, డీటీడీవోలతో ఏర్పాటు చేసిన అటవీ హక్కుల చట్టం కన్వర్జెన్స్ వర్క్‌షాపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారాన్ని పారదర్శకంగా చేపట్టాలని, అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులకు అటవీ హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హక్కు పత్రాలు తీసుకున్న తరువాత అడవులను నరికితే కఠిన చర్యలుంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm