హైదరాబాద్: విశాఖ జిల్లా గొల్లల ఎండాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతుండగా ఒక్కసారిగా గోడ కూలడంతో అక్కడే పనిచేస్తున్న గోవింద్, తిరుపతి అనే ఇద్దరు కూలీలపై గోడ పడడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. స్థానికుల సమాచారం తెలిసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm