హైదరాబాద్: న్యూరాలింక్ ప్రాజెక్టుకు ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధను అధిగమించేలా, మానవుల మేధస్సు సామర్థ్యాలను పెంచడానికి బ్రెయిన్ లో చిప్ అమర్చే ప్రయోగాలను చేపట్టబోతున్నారు. బ్రెయిన్ కంప్యూటర్ ఎంటర్ ప్రైజెస్ టెక్నాలజీతో మనిషి మెదడులో చిప్ పెట్టే ప్రయోగాలను 6 నెలల్లో చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. పక్షవాతం వచ్చిన వారి అవయవాలను కదిలించేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు చిప్, చూపు కోల్పోయిన వారికి సాయపడేలా మరో చిప్ ను రూపొందిస్తామన్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమవుతాయనే నమ్మకం ఉందని చిప్ ను తన బ్రెయిన్ లో, తన కుమారుడి బ్రెయిన్ లో అమర్చేంత నమ్మకం ఉందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm