హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మలయాళ సినిమా, టీవీ నటుడు కొచ్చు ప్రేమన్ అలియాస్ కేఎస్ ప్రేమ్‌కుమార్ కన్నుమూశారు. ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కొచ్చు ప్రేమన్ డ్రామా ఆర్టిస్టుగా తన నటనా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సినిమా రంగ ప్రవేశం చేసి గొప్ప పేరు తెచ్చుకున్నారు. అతను ఎక్కువగా కామెడీ పాత్రలు పోషించారు. పలు మలయాళం సీరియల్స్‌లో కూడా నటించారు.
Mon Jan 19, 2015 06:51 pm