హైదరాబాద్: జార్ఖండ్‌లోని రాంచీలో భారీ దొంగతనం జరిగింది. నగరానికి చెందిన ఓ కుటుంబం నగరంలోని ఓ ప్రముఖ క్లబ్‌లో తమ కూమార్తె వివాహాన్ని ఘనంగా జరిపిస్తున్న తరుణంలో సుముహూర్తం దగ్గర పడుతుండటంతో రీఫ్రెష్ అవ్వడానికి వారు తమ తమ గదులకు వెళ్లారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు నగలు, డబ్బు కనిపించకపోవడంతో ఆగం అయ్యారు. సీసీటీవీ ఆధారంగా మహిళ తన దుపట్టాలో నగలు, డబ్బు పెట్టుకుని ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు ఎత్తుకెళ్లిన మహిళ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm