గుజరాత్: గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ పర్వం సోమవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం పోలింగ్ సాగుతోంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ ఇతర జిల్లాల్లో 93 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్ ప్రక్రియ ఆరంభమైంది. రెండో దశ ఓటింగ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్‌తో సహా 61 రాజకీయ పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm