హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ ఎంపీ, టీడీపీ లోక్ సభాపక్ష నేత గల్లా జయదేవ్ నివాసంలో చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో, ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలను వారికి వివరించారు. అంతే కాకుండా చంద్రబాబు నేటి సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm