హైదరాబాద్: ములుగు జిల్లా వాజేడు మండలం, జగన్నాధపురం క్రాస్ దగ్గర మావోయిస్ట్ కొరియర్ దబ్బకట్ల సుమన్ ను పోలీసులు అదుపులొకి తీసుకున్నారు. మావోయిస్ట్ అగ్ర నాయకుల ఆదేశాల మేరకు రాజకీయ నాయకుల వద్ద వసూలు చేసిన లక్ష రూపాయలు పట్టుకొని వెళుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, లక్ష రూపాయల నగదు, సిమ్ కార్డ్, విప్లవ సాహిత్యం, లెటర్ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్పీ అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm