హైదరాబాద్: ప్రధాని అధ్యక్షతన జీ20 సదస్సు సన్నాహక సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. 2023లో జీ20 సదస్సును నిర్వహించే అవకాశాన్ని భారత్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో లో సదస్సుకు సంబంధించి అజెండాను ఖరారు చేయడానికి అన్ని పార్టీల నేతలతో నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. జీ20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని సలహాలను, సూచనలను స్వీకరించనున్నారు. ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. మరోవైపు ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm