హైదరాబాద్: అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ నివాళులర్పించారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని చర్చ చేయాల్సిందిగా తెలంగాణ ఎంపీల ను ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. నూతన పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ తన ఎజెండాలో చేర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆఫీసర్లు, ఉద్యోగులు ఈ డిమాండ్‌కు మద్దతు తెలపాలని, నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టలనేది సాంస్కృతిక ఉద్యమమని దీన్ని ఎవరూ ఆపలేరని గద్దర్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm