రంగారెడ్డి: రాజేంద్రనగర్ పుప్పాలగూడలో హెరాయిన్ గుట్టును టాస్క్‌ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హెరాయిన్ విక్రయిస్తున్న గొలం రోసుల్ మోమిన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 130 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేశారు. వెస్ట్ బెంగాల్ మాల్దా నుంచి హెరాయిన్‌ను కొన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. అతని వద్ద రెండు మొబైల్ ఫోన్లు, 2250 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm