విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్థి పవన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల వెనుక భాగంలో ఆరంగులాల గాయంతో పాటు.. ముఖం, ఎడమ భుజంపైన తీవ్ర గాయాలను పోలీసులు గుర్తించారు. రైల్వే ట్రాక్ పక్కన పవన్ మృతదేహం పడి ఉంది. పవన్ మృతదేహం పక్కనే కాలేజ్ బ్యాగ్‌ను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతుడు దాకమర్రి రఘు కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పవన్‌ది హత్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు... పవన్ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm