My compliments to Education Minister Smt @SabithaindraTRS Garu and VC Garu on laying the foundation for the new administrative block of the prestigious Osmania University with an estimated cost of ₹ 33 Crore 👍 pic.twitter.com/9qlxQnBWOV
— KTR (@KTRTRS) December 7, 2022
నవతెలంగాణ హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న నూతన పరిపాలనా భవనానికి హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. పదిహేను ఎకరాల్లో రూ.33.75 కోట్ల నిర్మాణ వ్యయంతో జీ ప్లస్ టు అంతస్థులతో పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. 123 గదులతో 1,08,020 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న దీనిని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత పరిపాలనా భవనం 1960లో నిర్మించారని, అరవై ఏళ్ల పైబడిన భవనం కావడంతో తరచూ మరమ్మత్తుల కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోందని ఓయూ అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పరిపాలన భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఓయూ వీసీ రవీందర్ యాదవ్‌కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.