నవతెలంగాణ జనగామ: జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ, లెక్చరర్ మల్లేష్ అటెండర్ రేణుక వద్ద రూ. 18 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వేతనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వాటి చెల్లింపునకు బాధితురాలి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం పాఠశాలలో ప్రిన్సిపాల్, లెక్చరర్‌కు ఆమె డబ్బులు అందజేస్తుండగా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm