హైదరాబాద్: నిన్న రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ కు ఎంపికైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి నేడు ఊహించని పరిణామం ఎదురైంది. నిన్న మొత్తం 8 మందితో రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో నేడు రాజ్యసభలో ప్యానెల్ సభ్యుల జాబితాను వెల్లడిస్తూ ఏడు పేర్లే చదివారు. అందులో విజయసాయి పేరు లేదు. ఆయనను వైస్ చైర్మన్ ప్యానెల్ నుంచి తొలగించినట్టు రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు. విజయసాయి తొలగింపునకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలో నాటకీయ పరిణామాల మధ్య విజయసాయి విశిష్ట పదవిని కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm