కృష్ణా: ప్రేమోన్మాది దాడిలో హత్యకు గురైన వైద్య విద్యార్థిని తపస్వి భౌతికకాయానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు. గురువారం ఉదయం టీడీపీ నాయకులు వర్ల రామయ్య, నన్నపనేని రాజకుమారి, గద్దె అనురాధ తపస్వి నివాసానికి చేరుకున్నారు. తపస్వి భౌతికకాయానికి నివాళులర్పించిన నేతలు.. ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సభ్య సమాజంలో ఇలాంటి చర్యలు దారుణమని టీడీపీ నేతలు అన్నారు. అంతకుముందు పామర్రు టీడీపీ ఇంఛార్జ్ వర్ల కుమార్ రాజా... వైద్యవిద్యార్థిని భౌతికకాయానికి నివాళులర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm