నవతెలంగాణ న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో పాలక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 68 స్ధానాలకు గాను కాంగ్రెస్ 37 స్ధానాల్లో ముందంజలో ఉండగా పాలక బీజేపీ 28 స్దానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ఇక ఇతరులు మూడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆప్ ఖాతా తేరవలేదు. హిమాచల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 35 మంది ఎమ్మెల్యేలను గెలుపొంది మేజిక్ ఫిగర్‌ను కాంగ్రెస్ సునాయాసంగా చేరుకుంది. బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది.
తమ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న రాజస్ధాన్‌కు తరలించాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ బాధ్యతను చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్, పార్టీ నేత భూపీందర్ సింగ్ హుడాలకు అప్పగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా సొంత ఇలాఖా కావడంతో బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ విస్పష్ట ఆధిక్యంతో దూసుకెళుతుండటం కమలనాధులను కలవరపాటుకు గురచేస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 08 Dec,2022 12:51PM