జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని రేగొండ మండలం, దుంపిల్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చందునాయక్ కుంట వద్ద ఇద్దరు బాలురు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు. మృతులు మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన గుండారపు వర్షిత్ (8), గుండేడు గ్రామానికి చెందిన నాంపల్లి పరశురాం(13)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కుంటలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరు బాలుర మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm