విజయవాడ: గాంధీనగర్ జింఖానా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదం జరిగింది. చిన్నారులు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో క్లోరిన్ లీక్ కావడంతో పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 10 మంది చిన్నారులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఒక బాలుడి పరిస్థితి క్రిటికల్‌గా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని డీఎంహెచ్ సుహాసిని తెలిపారు. క్లోరిన్ సిస్టమ్ నిర్వహణ సరిగ్గా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. త్వరలో జరగబోయే స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేందుకు స్విమ్మర్లకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm