హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిమచల్‌లో కీలకమైన విజయాన్ని అందించిన ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. అంకిత భావంతో కార్యకర్తలు, నాయకులు కృషి చేశారని, ప్రజలకు పార్టీ చేసిన వాగ్దానాలను సాధ్యమైనంత త్వరలో నెరవేరుస్తామన్నారు. గుజరాత్ ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని రాహుల్ చెప్పారు. పార్టీని పునర్వవస్థీకరించేందుకు కష్టపడతామని అన్నారు. దేశ ప్రజల ఆదర్శాలు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని ట్వీట్‌లో ద్వారా తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm