#WATCH: Mother, son miraculously escape unhurt as speeding train passes over them in Karnataka#Karnataka #India #ViralVideo #Viral #Shocking #Train #IndianRailway #Railway #railwayTracks pic.twitter.com/BoFeC7eyHI
— Free Press Journal (@fpjindia) December 8, 2022
బెంగళూరు: బుధవారం రాత్రి ఒక మహిళ తన కుమారుడితో కలిసి కాలబుర్గి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. రైలు పట్టాలు దాటుతూ ఒక ఫ్లామ్‌ఫామ్ నుంచి మరో ఫ్లాట్‌ఫామ్ వద్దకు వెళ్లేందుకు వారు ప్రయత్నించారు.
దీంతో తల్లి, కుమారుడు మరో ఫ్లాట్‌ఫామ్ వద్దకు చేరుకున్నారు. అయితే పైకి ఎక్కేలోగా ఒక గూడ్స్ రైలు వేగంగా ఆ పట్టాలపై వస్తున్నది. గమనించిన వెంటనే వారిద్దరూ ఫ్లాట్‌ఫామ్ కింద గోడ అంచులో కూర్చొని ఉండిపోయారు. భయపడిన కుమారుడు తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ గూడ్స్ రైలు వెళ్లిన తర్వాత వారిద్దరూ పైకి లేచి ఫ్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు. ఈ తరుణంలో ఆ మహిళ, ఆమె కుమారుడికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ సంఘటనను కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.