తిరుమల: జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జితసేవా టికెట్ల కోటాను ఈ నెల 12వ తేదీ టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ అనే వెబ్‌సైట్‌లో టీటీడీ ఈ కోటాను విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా వీటిని బుక్ చేసుకోవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్ల కోటాను ఎప్పటిలానే డిప్ విధానంలో భక్తులకు కేటాయించనున్నారు. ఈ కోటాను కూడా సోమవారం ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఎలక్ర్టానిక్ డిప్ విధానంలో గృహస్తులకు టికెట్ల కేటాయింపు జరుగుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm