నవతెలంగాణ - న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, విశిష్ఠ అతిథి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి, ప్రధాని మో, అతిరథ మహారథులతోపాటు ఆహుతులను త్రివిధ దళాలు, బీఎస్‌ఎఫ్, వివిధ రెజిమెంట్లకు చెందిన సైనికులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డేర్ డెవిల్స్ బృందం మోటారు సైకిళ్లపై చేసిన సాహస ప్రదర్శనలు రోమాలు నిక్కపొడిచేలా చేశాయి. ఇక బీఎస్‌ఎఫ్ ఒంటెలు పరేడ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Mon Jan 19, 2015 06:51 pm