నవతెలంగాణ - ఖాజీపేట
వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట వద్ద వైకాపా నాయకుడి కారు నుంచి భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన సోషల్ మీడియా కన్వీనర్ శివరామ్ కారు నుంచి 50 కేసుల కర్ణాటక మద్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని బ్రహ్మంగారి మఠానికి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఖాజీపేట వద్ద తనిఖీలు చేసి కారులో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో శివరామ్ దంపతులు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శివరామ్ దంపతులను కడప ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి రహస్యంగా విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.20లక్షలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Jan,2023 07:22PM