నవతెలంగాణ - హిందూపురం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు గురువారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజలకు అభివాదం చేసి వెనుదిరిగే సమయంలో వాహనం ముందుకు కదలడంతో నిల్చున్న బాలకృష్ణ ఒక్కసారిగా వెనక్కితూలి పడబోయారు. వెంటనే పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి గోపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm