నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 తొలి విడత పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జనవరి 28, 29, 30 తేదీల్లో పరీక్ష జరిగే వారి అడ్మిట్ కార్డులు ఇప్పుడు అందుబాటులోకి ఉంచింది. jeemain.nta.nic.in వెబ్‌సైటు నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.