నవతెలంగాణ - ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ జీవో ప్రచారం జరగుతుంది. గతంలో 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ట్యాంపర్ చేసి ఫేక్ జీవోను సృష్టించారు. అందులో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు అని ప్రచారం జరుగుతుంది.
దీంతో జీవోను ట్యాంపర్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఫేక్ జీవో సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందోననే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. జీవోను ట్యాంపర్ చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే ఉద్యోగుల పదవీ విరమణపై కలకలం రేపుతోన్న ఫేక్ జీవోపై పోలీసుకు ఫిర్యాదు చేసింది ఆర్థిక శాఖ. దీనిపై గుంటూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు డీఐపీ. ఈ క్రమంలో ఈ ఫేక్ జీవో ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jan,2023 01:38PM