Someone clipped a longer version of the #TyreNichols clip I had made
— Red Redact 🇺🇸🇨🇦 (@TheRedOperation) January 28, 2023
Tyre Nichols was indeed beaten like Rodney King, but this in this case, it was to his death
#TyreNicholsVideo #Memphis #Protest pic.twitter.com/EaiBY2hm9J
నవతెలంగాణ -వాషింగ్టన్
అగ్ర రాజ్యం అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో మరో నల్లజాతి యువకుడిపై ఐదుగురు పోలీసులు పాశవికంగా దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలంటూ అమెరికాలోని పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే యువకుడిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నెల 7న రాత్రి మెంఫిస్ నగరంలో టయిర్ నికోలస్ అనే 29 ఏళ్ల నల్లజాతీయుడు తన కారులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఏ కారణం చెప్పకుండానే అతడి వాహనానికి తమ వాహనం అడ్డుపెట్టి అతడిని కారులోంచి బయటికి ఈడ్చుకొచ్చారు. అనంతరం రోడ్డుపై ఇష్టారీతిన కాళ్లతో తన్నారు. మోకాళ్లపై నిలబెట్టి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత అతడిని రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయారు.