నవతెలంగాణ - హైదరాబాద్
సినీ నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన క్రమంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో తాజాగా హీరో కల్యాణ్ రామ్ స్పందించారు. నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్లర్ వేదికగా పంచుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm