నవతెలంగాణ-హైదరాబాద్ : రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడటం, రాజ్‌భవన్‌లో ఓ పార్టీకి చెందిన నాయకుల ఫొటోలను పెట్టడం సరికాదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాచరిక వ్యవస్థను మార్చాలని చెబుతున్న మోడీ.. బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను కూడా తొలగించాలని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు.
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతోంది. తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదు. పాత రైల్వే ప్రాజెక్టులను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేసింది. గడిచిన 8 ఏళ్లలో రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టును కూడా మోడీ ప్రారంభించలేదు. కొత్తగా 100 కి.మీ రైల్వే లైన్ కూడా వేయలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం కన్నా.. కేంద్రం తక్కువ ఖర్చు చేస్తోందని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 30 Jan,2023 07:07PM