నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగంపై సస్పెన్స్‌కు తెరపడింది. ఎట్టకేలకు చాలా గ్యాప్ తర్వాత రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు. ఉభయ సభల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్‌ను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల దృష్ట్యా గవర్నర్కు స్పీచ్ కాపీని మంత్రి అందజేశారు. కాగా పెండింగ్ బిల్లుపై చర్చకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం పెరుగుతూ వస్తున్న క్రమంలో ఇలాంటి పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా గతంలో రెండుసార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని అనుకున్న ప్రభుత్వం మనసు మార్చుకుని.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రకటించింది. తదనుగుణంగానే గవర్నర్‌ను మంత్రి ఆహ్వానించారు.
Mon Jan 19, 2015 06:51 pm