నవతెలంగాణ-కరీంనగర్ : దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఆగస్టు 16 నాటికి ఈ పథకం అమలు చేసి రెండేండ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ రోజున కరీంనగర్ జిల్లాలో జాతీయ దళిత బంధు సమ్మేళనం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. కరీంనగర్ నగరంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్( సర్క్యూట్ రెస్ట్ హౌస్), ఎమ్మెల్యే కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm