నవతెలంగాణ-న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్(97) కన్నుమూశారు. మంగళవారం రాత్రి 7గంటల సమయంలో ఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో రాజ్‌నారాయణ్ తరఫున న్యాయవాదిగా శాంతిభూషణ్ వాదనలు వినిపించారు. అనేక కీలక అంశాలపై దాఖలైన ప్రయోప్రయోజనాల వ్యాజ్యాలపై వాదనలు వినిపించిన ఆయన.. అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించిన న్యాయవాదిగా ప్రఖ్యాతి గాంచారు. పౌర స్వేచ్ఛకు ఆయనను ఛాంపియన్‌గా పేర్కొంటారు. దేశంలో ఎమర్జెన్సీ అనంతరం ఏర్పాటైన జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు న్యాయశాఖ మంత్రిగానూ సేవలందించారు. 1980లో ఆయన ప్రఖ్యాత ఎన్జీవో, సుప్రీంకోర్టులో పలు కీలక పిల్‌లను దాఖలు చేసే సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ సంస్థను స్థాపించారు. ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్ కూడా సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm