నవతెలంగాణ - హైదరాబాద్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర సందడి మొదలైంది. మినీ జాతర నేటినుంచి ప్రారంభంకానుంది. సమ్మక్క-సారక్క పూజారులు మండమెలిగే పండగ (మినీ జాతర)ను నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర అనంతరం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండ మెలిగే పండగను నిర్వహించనున్నారు. దీంతో గత రెండు రోజుల నుంచి వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం తరలి వస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క సారలమ్మ తల్లులకు బంగారం కానుకగా సమర్పిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm