నవతెలంగాణ - హైదరాబాద్
వృద్ధ దంపతులు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కూకట్పల్లి ఎస్సై చంద్రకాంత్, స్థానికుల వివరాల ప్రకారం.. కూకట్పల్లి వెంకట్రావునగర్ కాలనీలోని రోడ్డు నం-9లోని ఓ ఇంట్లో సోమిరెడ్డి (65), మంజుల (58) దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మియాపూర్లో, చిన్న కుమారుడు విదేశంలో ఉంటున్నారు. గాజులరామారంలో ఉంటున్న మంజుల సోదరుడు వెంకటరెడ్డి.. సోమిరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా తీయకపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు. మంజుల ఉరేసుకుని ఉండగా సోమిరెడ్డి నేలపై పడి ఉన్నాడు. అతని నోటి నుంచి నురగలు రావడాన్నిబట్టి ఏదైనా క్రిమి సంహారక మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Feb,2023 08:17AM