నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ గ్రూప్-1 మెయిన్ పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జూన్ 5 నుంచి 12 వరకు ఏడు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జూన్ 11న ఆదివారం పరీక్ష ఉండదు. పరీక్షలన్నీ హైదరాబాద్ (హెచ్ఎండీఏ పరిధిలో) కేంద్రంలో మాత్రమే నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పరీక్షతోపాటు మరో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ 150 మార్కులకు ఉన్నప్పటికీ, అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రతి పేపర్‌కు 3 గంటల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Feb,2023 08:24AM