నవతెలంగాణ - న్యూఢీల్లి
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం మరికాసేపట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు. పార్లమెంట్‌లో నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో 2023-24 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు సమావేశానికి హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm