నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2023 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ తరుణంలో ప్రసంగిస్తూ భారత ఆర్ధిక వ్యవస్థ దివ్యమైన భవిష్యత్తు దిశగా వెళ్తోందన్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని ఆమె తెలిపారు. కోవిడ్ సమయంలో ఎవరూ ఆకలితో చావకూడదన్న ఉద్దేశంతో సుమారు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందజేసినట్లు మంత్రి తెలిపారు.
28 నెలలుగా ఆ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గడిచిన 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెండింతలు అయ్యిందని, అది 1.97 లక్షలకు చేరుకున్నట్లు, భారతీయ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచలోనే అయిదవ అతిపెద్ద వ్యవస్థగా మారిందన్నారు. భారతీయ ఆర్ధిక వ్యవస్థ సరైన ట్రాక్‌లో ఉందని, భారత్ ధగధగ వెలుగుతున్న నక్షత్రమని ప్రపంచం గుర్తించిందని, ఈ ఏడాదికి మన వృద్ధి 7.0 శాతంగా ఉందని, అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో మనదే అత్యధిక స్థాయిలో ఉందన్నారు. టూరిజంకు భారీ స్థాయిలో ప్రమోషన్ ఇవ్వనున్నట్లు, డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత ఆర్ధిక వ్యవస్థ చాలా పరిణితి సాధించిందని పలు విషయాలు ప్రసంగించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Feb,2023 11:46AM