నవతెలంగాణ - హైదరాబాద్
వేతన జీవులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను విధానంలో కీలక మార్పులు ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 12.40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,104.61 పాయింట్లు లాభపడి 60,654.51 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 282.90 పాయింట్లు లాభపడి 17,945.05 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.72గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీల్లో దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm