నవతెలంగాణ - హైదరాబాద్
మాసబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయంలో నేడు నూతన ఫిష్ క్యాంటీన్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ తరుణంలో మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేపలు, రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. గడిచిన ఈ ఎనిమిది ఏండ్లలో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నీటి వనరులలో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm