నవతెలంగాణ-నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండలం దామవరం దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఐషర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐచర్ లారీలో వంట సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్‌కు గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో మృతుడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm