Maharashtra | 2 persons died after a drum containing a chemical exploded in the Bhiwandi area of Thane. The deceased were scrap dealers and died after a man lit a cigarette near drums containing Diethylene Glycol: Thane Municipal Corporation pic.twitter.com/B7sgciTD3O
— ANI (@ANI) February 1, 2023
నవతెలంగాణ -మహారాష్ట్ర
థానె జిల్లాలోని భివాండి ఏరియాలోగల ఓ స్క్రాప్ దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ఓ స్క్రాప్ దుకాణంలో ఖాళీ కెమికల్ డ్రమ్ము పేలిపోవడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులిద్దరూ ఆ స్క్రాప్ దుకాణం నిర్వాహకులేనని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బుధవారం మధ్యాహ్నం నిర్వాహకులు ఇద్దరూ స్క్రాప్ దుకాణంలో ఉండగా ఓ వ్యక్తి వారి దగ్గరికి వచ్చాడు.
వాళ్లు కెమికల్ డ్రమ్ములను క్లీన్ చేస్తుండగా వారికి కొద్ది దూరంలో నిలబడి అతను సిగరెట్ వెలిగించాడు. అంతే ఒక్కసారిగా భారీ శబ్దంతో కెమికల్ డ్రమ్ము పేలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న షాప్ నిర్వాహకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. డ్రమ్ములో ఉన్నది డై ఇథైల్ గ్లైకాల్ అనే కెమికల్ అని, దానికి పేలుడు స్వభావం ఉంటుందని, అందుకే సిగరెట్ వెలిగించగానే డ్రమ్ము పేలిపోయిందని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.