నవతెలంగాణ - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఈ నెల 2 నుంచి 14 వరకు సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసినట్లు జీవా ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సువర్ణమూర్తి భగవద్రామానుజులకు ఉత్సవారంభ స్నపనంతో వేడుకలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm