నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. గోదాము పరిసరాల్లో బస్తీలు ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. షాక్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Feb,2023 07:24AM