నవతెలంగాణ - కడప
ఎక్కువగా జన సంచారం ఉండే కడప నడిబొడ్డున ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కడప పట్టణానికిచెందిన రేవంత్ (27), అభిలాష్ (29) స్నేహితులు. బుధవారం రాత్రి నగరంలోని సాయిబాబా థియేటర్‌కు సమీపంలోని రఘు బార్‌కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి బయటకు వచ్చారు. కాపు కాచిన నలుగురు యువకులు వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రేవంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన అభిలాష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అభిలాష్ గురువారం ఉదయం మృతిచెందాడు. హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Feb,2023 12:55PM