నవతెలంగాణ -అమరావతి
ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నియామకాలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను కలిపి ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. మరోవైపు ఎప్పటి నుంచో సలహాదారలు నియామకాలు జరుగుతున్నాయని, దీనిపై ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
రాజ్యాంగ విరుద్ధంగా వీరిని నియమించట్లేదని, కేబినెట్ హోదా కూడా ఇవ్వట్లేదని కోర్టుకు తెలిపారు. చాలామంది సలహాదారుల కాలపరిమితి ముగిసిపోనుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరుణంలో వాదనలు విన్న న్యాయస్థానం బయట నుంచి నియమితులైన వారిలో జవాబుదారీతనం ఎలా ఉంటుందని ప్రశ్నించింది. బయటి వారికి ప్రవర్తనా నియమావళి లేదని. వారివల్ల సున్నిత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 28కు హైకోర్టు వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Feb,2023 07:48PM